MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 7:30 pm Posted by : MANA TOLIVELUGU

పులిగిల్ల బాలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ చామల

మన తొలివెలుగు | యాదాద్రి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్ (4 అక్టోబర్2026) :

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులిగిల్ల బాలయ్య తండ్రి పులిగిల్ల యాదగిరి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి పులిగిల్ల బాలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. యాదగిరి మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఎంపీ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఎంపీ వెంట భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పిసిసి డెలిగేట్ మరియు తంగళ్ళపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పడిగల ప్రదీప్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అత్తర్, ముత్తిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ రాంపల్లి కృష్ణ, ఉప సర్పంచ్ అందే మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మెరుగు స్వామి, గంగసానిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు బోయిని నాగేష్, ముత్తిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ అబ్బయ్య, రాగుల రవీందర్, యూత్ కాంగ్రెస్ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు.